గాంధీజీ, షేక్ జాయెద్ జీవితాంశాలతో డిజిటల్ మ్యూజియం

Wed,December 5, 2018 02:57 AM

India and UAE sign currency swap deal

ప్రారంభించిన కేంద్ర మంత్రి సుష్మ, యూఏఈ మంత్రి అబ్దుల్లా
అబుదాబి, డిసెంబర్ 4: జాతిపిత మహాత్మాగాంధీ, ఆధునిక యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్(యూఏఈ) నిర్మాత షేక్ జాయెద్ జీవిత అంశాలతో కూడిన డిజిటల్ మ్యూజియాన్ని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, యూఏఈ విదేశాంగ శాఖ మంత్రి అబ్దుల్లా బిన్‌జాయెద్ అల్ నహ్యాన్ మంగళవారం ప్రారంభించారు. గాంధీజీ 150వ జయంత్యుత్సవాలు, షేక్ జాయెద్ 100వ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఈ మ్యూజియాన్ని ప్రారంభించడం విశేషం. గాంధీ, జాయెద్ జీవిత పథం, అనుసరించిన మార్గం తదితరాలతో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు.

భారత్, యూఏఈ మధ్య పరస్పర నగదు మార్పిడికి ఎంవోయూ

భారత్, యూఏఈ మధ్య నగదు మార్పిడితోపాటు ఆఫ్రికాలో అభివృద్ధి ప్రాజెక్టుల అమలులో పరస్పర సహకారం కోసం రెండు అవగాహనా ఒప్పందాల (ఎంవోయూ)పై ఇరు దేశాల ప్రతినిధులు సోమవారం సంతకాలు చేశారు. నగదు మార్పిడి ఒప్పందం ప్రకారం అమెరికా డాలర్లతో నిమిత్తం లేకుండా ఆయా దేశాల సొంత కరెన్సీ చెల్లింపులతోనే వాణిజ్యానికి వీలవుతుంది. భారత్-యూఏఈ సంయుక్త కమిషన్ సమావేశాల్లో పాల్గొనేందుకు అబుదాబి వచ్చిన సుష్మాస్వరాజ్ యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో చర్చలు జరిపారు. వాణిజ్యం, రక్షణ సహా పలు రంగాల్లో ఉమ్మడి సహకారంపై వారు చర్చించారు.

502
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles