అమెరికాలో పెరుగుతున్న ద్వేషపూరిత దాడులు


Wed,November 15, 2017 12:17 AM

-2016లో 6121కేసులు నమోదు
వాషింగ్టన్: అమెరికాలో ద్వేషపూరిత నేరాల పెరుగుదలపై ఆందోళన వ్యక్తమవుతున్నది. 2016లో 6121 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2014తో పోలిస్తే 2015లో 10శాతం పెరుగగా, 2016లో మరో ఐదుశాతం దాడులు పెరిగాయని తెలుస్తున్నది. ఈ ఆరువేల కేసుల్లో అత్యధికం జాత్యహంకార ఘటనలే. ప్రధానంగా నల్లజాతీయులపైన, ఆఫ్రికన్-అమెరికన్లపై జరిగిన దాడులే అత్యధికం. ముస్లింలపై 1500 వరకు దాడులు జరిగాయని సమాచారం. గతేడాది హిందువులకు వ్యతిరేకంగా 12, సిక్కులకు వ్యతిరేకంగా ఏడు ద్వేషపూరిత దాడులు జరిగినట్లు ఎఫ్‌బీఐ నివేదిక తెలిపింది. బౌద్ధులపై ఒకే ఒక్క దాడి ఘటన జరిగిందని తెలిపింది. మొత్తం దాడి ఘటనల్లో 3.1శాతం ఆసియావాసులపై, 1.3శాతం అరబ్‌దేశాల పౌరులపై జరిగాయని పేర్కొన్నది.

176
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS