తప్పులో కాలేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్

Thu,June 20, 2019 01:07 AM

Imran Khan takes notice of journalist minister altercation

- రవీంద్రనాథ్ ఠాగోర్ కవితను జిబ్రాన్‌దిగా పేర్కొంటూ ట్వీట్

ఇస్లామాబాద్, జూన్ 19: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ఓ ట్వీట్ తీవ్ర విమర్శలకు దారి తీసింది. బుధవారం స్ఫూర్తిదాయక కవితా పంక్తులను తన ట్విట్టర్ ఖాతాలో ఆయన పోస్ట్ చేశారు. జీవితమంతా సంతోషంగా ఉన్నట్లు నిద్రలో నేను కలగన్నాను. నిద్ర లేచాక జీవితమంటే సేవ అని గ్రహించాను. జీవితాంతం సేవ చేసి అందులోని సంతోషాన్ని అనుభవించాను.. ఖలీల్ జిబ్రాన్ కవిత్వంలోని జ్ఞానాన్ని అర్థం చేసుకున్న వారు చాలా సంతృప్తితో ఆనందంగా జీవిస్తారు అని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. కాగా ఈ పంక్తులు భారత్‌కు చెందిన ప్రసిద్ధ కవి, నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగోర్ కవితలోనివి. దీంతో ఇమ్రాన్ ఖాన్ ట్వీట్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఖాన్ నుంచి మరో తెలివితక్కువ ట్వీట్, పాక్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.. ఆ దేశ ప్రధాని స్థిరంగా లేరు, మిస్టర్ ప్రధాని మీరు ఎప్పుడూ రైటే.. మీకో నమస్కారం, తెలివితక్కువతనానికి మీరే చిరునామా, మీ ఐక్యూ చాలా ఎక్కువ.. అని ఎద్దేవా చేశారు.

628
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles