నాన్న హంతకుల్ని క్షమించాం: రాహుల్

Mon,March 12, 2018 02:56 AM

I Told Him He Was Going To Die Rahul Gandhi On Father Assassination

Rahul-gandhi
సింగపూర్, మార్చి 11: తమ తండ్రి రాజీవ్ గాంధీ హంతకులను తాను, తన సోదరి ప్రియాంక గాంధీ పూర్తిగా క్షమించేశామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. సింగపూర్‌లోని ఐఐఎం పూర్వ విద్యార్థుల సంఘ ప్రతినిధులతో ఇష్ఠాగోష్టిగా మాట్లాడుతూ, తన నానమ్మ ఇందిర, తండ్రి రాజీవ్ తీసుకున్న నిర్ణయాలకు మూల్యం చెల్లించక తప్పదని తమ కుటుంబానికి ముందే తెలుసునన్నారు. మా నానమ్మ తనను చంపేస్తారని ముందే నాతో చెప్పారు. మా నాన్న చనిపోతున్నారని నేను నాన్నతో ముందే అన్నాను అని రాహుల్ గుర్తు చేశారు. ఆయన ప్రసంగం వీడియో కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ఖాతాలో షేర్ అవుతున్నది. మా తండ్రి హత్య తర్వాత మేం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం. కొన్నేండ్లపాటు చాలా కోపంతో ఉన్నాం. కానీ మేం హంతకులను క్షమించాం అని రాహుల్ తలిపారు. 1991 మే 21న మాజీ ప్రధాని రాజీవ్‌ను ఎల్టీటీఈ ఆత్మాహుతి దళ సభ్యురాలు హతమార్చిన సంగతి తెలిసిందే. ఎల్టీటీఈ వ్యవస్థాపకుడు ప్రభాకరన్ మృతదేహాన్ని టీవీ చానెల్‌లో చూసినప్పుడు ఆయన్ను ఎందుకు ఇలా అవమానిస్తున్నారు, ఆయన భార్యా పిల్లలు అనాథలయ్యారు భావం కలిగిందన్నారు. తన సోదరి ప్రియాంకకు కూడా అదే అభిప్రాయం వచ్చిందన్నారు. వ్యక్తులను ద్వేషించడం కష్ట సాధ్యమన్నారు. అంతకుముందు 1984లో తన నానమ్మ ఇందిరాగాంధీ హత్యకు ముందు ఆమె హంతకులతోనే బ్యాడ్మింటన్ ఆడేవాడినని గుర్తు చేసుకున్నారు. తన నానమ్మ మృతి చెందే నాటికి 14 ఏండ్ల వయస్కుడినన్న రాహుల్.. నాటి నుంచి రోజంతా 15 మంది వ్యక్తిగత భద్రతా సిబ్బంది మధ్య గడుపుతున్నానన్నారు.

1015
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles