దూసుకొస్తున్న ఫ్లారెన్స్ హరికేన్!

Thu,September 13, 2018 01:10 AM

Hurricane Florence weakens to Category 3, on path to deliver disaster for days to the Carolina coast

మూడు రాష్ర్టాల్లో ఎమర్జెన్సీ ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
సురక్షిత ప్రదేశాలకు తరలివెళుతున్న ప్రజలు

విల్మింగ్టన్ : అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఫ్లారెన్స్ హరికేన్ ప్రభావం చూపే నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా రాష్ర్టాల్లో అమెరికా అధ్యక్షుడు డొ నాల్డ్ ట్రంప్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఫ్లారెన్స్ విపత్తును ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉం దని తెలిపారు. ఈ మూడు రాష్ర్టాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కరోలినా కోస్తా తీరం నుంచి గంటకు 225 కి.మీ వేగంతో చలిగాలులు వీస్తున్నాయి. దాదాపు 54 లక్షల మంది సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్తున్నారు. గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత గానీ, శుక్రవారం తెల్లవారుజామున గానీ ఫ్లారెన్స్ తీరాన్ని దాటొచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. దీనివల్ల 30 సెంమీ నుంచి 60 సెం.మీ వర్షపాతం కురిసే అవకాశం ఉన్నదన్నారు. సౌత్ కరోలినా నుంచి ఓహియో, పెన్సిల్వేనియా రాష్ర్టాల ప్రజలంతా తాగునీరు, నిత్యావసరాల కోసం దుకాణాల వద్ద బారులు తీరడంతో పలు దుకాణాల్లో ఆహార పదార్థాల కొరత ఏర్పడింది.

478
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles