భారత సంతతి మహిళకు అమెరికాలో జైలు!

Sat,July 20, 2019 01:01 AM

Human Smuggling Indian Origin Woman Jailed In US

న్యూయార్క్: చట్టవిరుద్ధంగా వందల మందిని అమెరికాకు తీసుకొచ్చిన నేరానికి భారత సంతతి మహిళ హేమా పటేల్(51)కు అమెరికా కోర్టు మూడేండ్ల జైలుశిక్ష విధించింది. ఆమెకు చెందిన 72 లక్షల డాలర్ల (రూ.50 కోట్లు) విలువచేసే ఆస్తులను జప్తుచేసింది. ఒక్కో వ్యక్తి నుంచి రూ. 20-40 లక్షలు చొప్పున రుసుము స్వీకరించి మనుషుల అక్రమ రవాణాకు పాల్పడ్డారన్న అభియోగంపై హేమను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది జూన్‌లో ఆమె నేరాన్ని అంగీకరించారు. దీంతో టెక్సాస్‌లోని ఆమె రెండు హోటళ్లు, రూ.48 కోట్లు విలువైన బెయిల్ బాండ్లు, రూ.3కోట్ల నగదు, 11 బంగారు కడ్డీలు, మరికొన్ని ఆస్తులను జప్తు చేశారు.

429
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles