హాంకాంగ్‌లో చల్లారని నిరసనలు!

Mon,June 17, 2019 01:58 AM

Hong Kong rectifica i susp�n la pol�mica llei extradicio

-క్యారీలామ్ తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్
హాంకాంగ్: నేరస్తుల అప్పగింత బిల్లుపై ప్రభుత్వం దిగివచ్చినప్పటికీ హాంకాంగ్‌లో ప్రజాగ్రహం చల్లారడం లేదు. వేలాదిమంది నిరసనకారులు ఆదివారంనాడు హాంకాంగ్ వీధుల్లోకొచ్చి బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. చైనా అనుకూల నాయకురాలు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీలామ్‌కు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించారు. చైనాకు నేరస్తుల అప్పగింతకు సంబంధించిన ప్రతిపాదిత బిల్లును శాశ్వతంగా నిలిపివేయాలని, క్యారీలామ్ తన పదవికి రాజీనామా చేయాలంటూ నినదించారు. చైనాకు నేరస్తుల అప్పగింతకు సంబంధించిన ప్రతిపాదిత బిల్లును నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు హాంకాంగ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాల ప్రేరణతో కొందరు వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగడం, ప్రజల్లో దీనిపై అపోహలు సృష్టిస్తుండడంతో ఈ బిల్లును కొంత కాలం పాటు జాప్యం చేయాలని తాము భావించినట్టు క్యారీలామ్ చెప్పారు. నేరస్తుల అప్పగింత బిల్లుపై ఫిబ్రవరిలో చర్చల ప్రక్రియను హాంకాంగ్ ప్రారంభించింది. జూలైలో బిల్లును చట్ట సభ ముందుంచాలని భావించింది. అయితే, ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో వెనక్కు తగ్గింది.

318
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles