అత్యంత పలుచటి 3డీ హోలోగ్రామ్ సృష్టి


Sat,May 20, 2017 02:52 AM

- మనిషి వెంట్రుక కంటే 1000 రెట్లు సూక్ష్మం

3d
కాన్‌బెర్రా: ప్రపంచంలోనే అత్యంత పలుచనైన 3డీ హోలోగ్రామ్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. 3డీ అద్దాలు లేకుండా దానిని చూడవచ్చు. ఈ 3డీ హోలోగ్రామ్‌ను నిత్యం మనం వినియోగించే టీవీలు, కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లకు వాడుకోవచ్చు. ఇప్పటివరకు 3డీ హోలోగ్రామ్స్ స్టార్‌వార్, అవతార్ వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలకే పరిమితమయ్యాయి. దీనిని సవాల్‌గా తీసుకొని ఆధునిక ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో వినియోగించే స్థాయిలో అత్య ంత పలుచని 3డీ హోలోగ్రామ్‌ను ఆస్ట్రేలియాలోని ఆర్‌ఎంఐటీ విశ్వవిద్యాలయం పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది మనిషి వెంట్రుక కంటే 1000 రెట్లు పలుచుగా ఉంటుందని, వీటిని తయారు చేయడం కూడా సులువేనని శాస్త్రవేత్తలు తెలిపారు.

572

More News

VIRAL NEWS