హిందువులకు ఆధిపత్య ఆరాటంలేదు

Sun,September 9, 2018 02:02 AM

Hindus have no aspiration of dominance

ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్
షికాగో: సమాజంలో ఆధిపత్యం కోసం హిందూ జాతి ఎప్పుడూ ఆరాటపడలేదని ఆర్‌ఎస్‌ఎస్) అధినేత మోహన్ భగవత్ పేర్కొన్నారు. 1893లో షికాగోలో జరిగిన ప్రపంచ మతాల సమ్మేళనంలో స్వామి వివేకానంద చారిత్రక ప్రసంగం చేసిన 125 ఏండ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన రెండో ప్రపంచ హిందూ మహాసభల్లో భగవత్ శనివారం మాట్లాడుతూ లక్ష్యాల సాధన కోసం హిందువులు ఉమ్మడిగా పనిచేస్తేనే హిందూ సమాజం సుసంపన్నం అవుతుందన్నారు. హిందూ సమాజ నాయకులంతా సమిష్టిగా పనిచేసి మానవజాతి ఉన్నతికి పాటుపడాలన్నారు. అహం నియంత్రణ, ఏకాభిప్రాయాన్ని అంగీకరించే మనసు ఉంటే ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురావొచ్చన్నారు. సింహం ఒంటరిగా ఉంటే అడవి కుక్కలు సామూహికంగా దాని పై దాడిచేసి చంపేయగలవు. ఈ నిజాన్ని మనం మర్చిపోకూడదు. మనం ప్రపంచాన్ని ఉత్తమ మార్గంలో నడుపాలనుకుంటున్నాం అని భగవత్ పేర్కొన్నారు. హిందూ ధర్మం అతి పురాతనమైనదని, అదే సమయంలో అత్యాధునికమైనదని తెలిపారు.

540
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles