పెన్నుతో బెదిరించి హైజాక్‌కు యత్నం


Sun,April 15, 2018 11:55 PM

-చైనాలో అత్యవసరంగా దిగిన విమానం
బీజింగ్, ఏప్రిల్ 15: తన చేతిలో ఉన్న ఫౌంటేన్ పెన్ ఆయుధమని బెదిరించి ఓ ప్రయాణికుడు విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆదివారం ఉదయం చైనాలోని చాంగ్షా నుంచి ఉదయం 8.40 గంటలకు ఎయిర్ చైనా 1350 విమానం ప్రయాణికులతో బీజింగ్‌కు బయల్దేరింది.

ఇందులో ఉన్న అన్హువా (41) అనే మతిస్థిమితంలేని ప్రయాణికుడు విమాన సిబ్బంది ఒకరికి ఫౌంటేన్ పెన్ చూపించి, అది ఒక ఆయుధమని బెదిరించాడు. దీంతో పైలట్ విమానాన్ని 9.58 గంటలకు హెనాన్ రాష్ట్రంలోని జెంగ్జో జిన్జెంగ్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించివేశాడని చైనా పౌరవిమానయాన శాఖ (సీఏఏసీ) తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా విమానాన్ని మళ్లించినట్టు ఎయిర్ చైనా వెబ్‌సైట్‌లో పేర్కొన్నది. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది క్షేమమని తెలిపింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ద పేపర్ వార్తా సంస్థ పేర్కొన్నది.

251

More News

VIRAL NEWS