‘మన సిదూ’్ధ ఎక్కడ?

Mon,November 11, 2019 12:55 AM

- పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఆరా
- కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభం సందర్భంగా మరోసారి బయటపడిన ఇరువురి స్నేహ బంధం

లాహోర్‌: కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ, పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మధ్య ఉన్న స్నేహ బంధం మరోసారి వెల్లడయ్యింది. శనివారం కర్తార్‌పూర్‌ ప్రారంభోత్సవానికి అధికారులతో కలిసి మినీ బస్సులో వెళ్తున్న సందర్భంగా ‘మన సిద్ధ్దూ’ ఎక్కడ అని అక్కడున్న వారిని ఇమ్రాన్‌ ఖాన్‌ అడిగారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిద్ధ్దూ కూడా తన ప్రసంగంలో ఇమ్రాన్‌ ఖాన్‌ను తెగ పొగిడేశారు. యార్‌ దిల్‌దార్‌.. ఇమ్రాన్‌ఖాన్‌ అని అభివర్ణించారు. ‘దేశ విభజన తర్వాత సరిహద్దులు చెరిగిపోవడం ఇదే తొలిసారి. ఇందులో నా స్నేహితుడు ఇమ్రాన్‌ ఖాన్‌ సహకారాన్ని ఎవరూ తోసిపుచ్చలేరు. మోదీజీకి కూడా ధన్యవాదాలు’ అని అన్నారు. మరోవైపు సిద్ధూ తీరును బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర తప్పుపట్టారు. ఇమ్రాన్‌ ఖాన్‌ను ఆయన అతిగా పొగిడి భారత్‌ను దిగజార్చినట్లుగా వ్యవహరించారని ఆరోపించారు.

337
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles