పాకిస్థాన్‌లో జడ్జి నివాసం పైకి కాల్పులు


Mon,April 16, 2018 12:54 AM

లాహోర్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అవినీతి కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇజాజ్ ఉల్ అహసాన్ నివాసంపై ఓ దుండగుడు ఆదివారం రెండు సార్లు కాల్పులు జరిపాడు. కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. దీనిపై పాక్ చీఫ్ జస్టిస్ సకీబ్ నిసార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్ ఐజీకి సమన్లు జారీచేశారు. ఘటనను పాక్ ప్రధాని అబ్బాసీ, పంజాబ్ సీఎం షహజాబ షరీఫ్, పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్, లాహోర్ హైకోర్టు బార్ అసోసియేషన్లు ఖండించాయి.

244

More News

VIRAL NEWS