మనుమడికి 72 ఏండ్ల జైలుశిక్ష

Mon,June 19, 2017 01:16 AM

-ఆహారం విషయంలో తాతపై దాడి చేసినందుకు..
వాషింగ్టన్: ఆహారం విషయంలో తాతతో గొడవపడి ఆయన్ను కొట్టి చంపిన మనుమడికి అమెరికాలోని ఓ కోర్టు 72 ఏండ్ల జైలుశిక్ష విధించింది. తన తాతను జాసన్ వ్యాంబోమ్మెల్ తీవ్రంగా కొట్టి చంపాడని ఏప్రిల్‌లో స్థానిక కోర్టు అతడిని నేరస్థుడిగా నిర్ధారించింది. తర్వాత వ్యాంబోమ్మెల్‌కు అరాపహొ జిల్లా జడ్జి ఫిలిప్ డగ్లస్ శుక్రవారం జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. 2015 డిసెంబర్ 29న జాసన్ వ్యాంబోమ్మెల్ రొయ్యలు వండవద్దని నానమ్మతో అతడు వాదించాడు. అలా చేయవద్దంటూ తాత ఫ్రాన్స్ హితవు పలుకగా, ఒక్కసారిగా ఆగ్రహం చెందిన జాసన్ ఆయన తలపై పిడిగుద్దులు కురిపించాడు. ఆయనను హాస్పిటల్‌కు తరలించగా, చికిత్స పొందుతూ జనవరి 6న చనిపోయారు.

280
Tags

More News

మరిన్ని వార్తలు...