గ్రీన్‌కార్డుల జారీలో దేశాల కోటాకు చెల్లు!

Sat,February 9, 2019 01:27 AM

Go to the quota of countries in the issuance of green cards

-అమెరికా కాంగ్రెస్ ముందుకు రెండు కీలక బిల్లులు
-ఆమోదం లభిస్తే లక్షలాది భారతీయ నిపుణులకు లబ్ధి

వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసానికి అవసరమైన గ్రీన్‌కార్డుల జారీకి ప్రస్తుతం అనుసరిస్తున్న దేశాల కోటా పద్ధతిని ఎత్తివేసి ప్రతిభ ఆధారంగా గ్రీన్‌కార్డులు మంజూరు చేసేందుకు ఉద్దేశించిన రెండు కీలక బిల్లులను అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. ఇవి అమల్లోకి వస్తే లక్షలాది మంది భారతీయ నిపుణులకు లబ్ధి చేకూరనుంది. ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డుల జారీలో దేశాలకు కేటాయించే 7 శాతం కోటా పరిమితిని ఎత్తివేసేందుకు ఉద్దేశించిన ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్స్ యాక్ట్‌ను రిపబ్లిక్ సభ్యుడు మైక్ లీ, డెమోక్రటిక్ సభ్యులు కమలా హ్యారిస్ బుధవారం సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఇలాంటిదే మరో బిల్లును కాంగ్రెస్ సభ్యులు జో లోఫ్‌గ్రెన్, కెన్ బక్‌లు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అమెరికా ఏటా 1,40,000 గ్రీన్‌కార్డులను జారీ చేస్తున్నది.అయితే దేశ జనాభాతో సంబంధం లేకుండా ప్రతి దేశానికి 7 శాతం కోటా పరిమితి అమలు చేస్తున్నది. దీని వల్ల భారత్, చైనాలకు చెందినవారికి నష్టం కలుగుతున్నది.

845
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles