రికార్డు స్థాయికి కర్బన ఉద్గారాలు


Tue,November 14, 2017 01:36 AM

emissions
బాన్, నవంబర్ 13: ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది కర్బన ఉద్గారాలు రెండు శాతం పెరిగి రికార్డు స్థాయికి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు సోమవారం హెచ్చరించారు. 2014 -16 మధ్య స్థిరంగా ఉన్న కర్బన ఉద్గారాల విడుదల, ఈ ఏడాది చైనా పారిశ్రామికంగా పుంజుకోవడంతో మళ్లీ పెరిగిందని పేర్కొన్నారు. జర్మనీలోని బాన్ నగరంలో జరిగిన 200కుపైగా దేశాల సమావేశంలో 2015 పారిస్ వాతావరణ ఒప్పందం అమలుకోసం ఒక నివేదికను ప్రవేశపెట్టారు. శిలాజ ఇంధనాలు, పరిశ్రమల నుండి వెలువడుతున్న కార్బన్‌డయాక్సైడ్, మానవ కార్యకలాపాల ద్వారా విడుదలవుతున్న ఉద్గార వాయువులు 2017లో రెండు శాతం పెరిగి రికార్డు స్థాయిలో 37 బిలియన్ టన్నులకు చేరుకుంటుందని 15 దేశాలకు చెందిన 76 మంది శాస్త్రవేత్తలు ఒక నివేదికలో వెల్లడించారు. చైనా నుండి వెలువడుతున్న ఉద్గారాలు 3.5 శాతం పెరుగగా, అమెరికాలో 0.4 శాతం తగ్గాయని చెప్పారు. ప్రపంచవ్యాప్త కర్బన ఉద్గారాలలో చైనా వాటా 30శాతంగా ఉన్నది.

169

More News

VIRAL NEWS