ఐరాస సాధారణ సభలో..

Fri,August 17, 2018 07:45 AM

Former PM Atal Bihari Vajpayee delivered Indias first ever Hindi speech at UN in 1977

హిందీలో ప్రసంగించిన తొలి నేత వాజపేయి
ఐరాస, ఆగస్టు 16: భారత రాజకీయాల్లో మేరునగధీరుడైన వాజపేయి ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో సైతం పలు రికార్డులు నెలకొల్పారు. ఐరాస సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన మొట్టమొదటి భారత విదేశాంగశాఖ మంత్రి అటల్‌జీయే కావడం విశేషం. ఆ ప్రసంగంలో అణు నిరాయుధీకరణ, ఐరాసలో సంస్కరణలు, ప్రభుత్వాలు నడిపిస్తున్న ఉగ్రవాదం వంటి అంశాలపై అత్యంత ప్రభావవంతంగా తన గళాన్ని వినిపించారు. ప్రధానమంత్రిగా, విదేశాంగశాఖ మంత్రిగా 1977 నుంచి 2003 మధ్య ఏడుసార్లు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయానికి వెళ్లిన వాజపేయి.. అన్నిసార్లూ అద్భుత ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. జనతా ప్రభుత్వంలో విదేశాంగశాఖ మంత్రిగా ఉన్న ఆయన 1977లో జరిగిన ఐరాస 32వ సాధారణ సభ సమావేశంలో మొదటిసారి పాల్గొన్నారు.

ఆ సందర్భంగా చారిత్రాత్మక హిందీ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన ఐక్యరాజ్య సమితికి నేను కొత్త. కానీ భారత్ కొత్తకాదు. ఐరాస మొట్టమొదట ఏర్పడినప్పటి నుంచి భారత్ చురుకైన భాగస్వామిగా ఉన్నది. నా దేశంలో రెండు దశాబ్దాలకు పైగా పార్లమెంటేరియన్‌గా ఉన్న నేను.. మొట్టమొదటిసారిగా ఐరాస సాధారణ సభ సమావేశంలో పాల్గొనడం ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తున్నది అని తెలిపారు. అంతకుముందు సాధారణ సభలో ప్రసంగించిన అందరు భారత నేతలు ఇంగ్లిష్‌లోనే ప్రసంగించారు. ఆంగ్లంలో కూడా అద్భుతంగా ప్రసంగించగల నైపుణ్యం ఉన్న అటల్‌జీ.. అంతర్జాతీయంగా హిందీకి ప్రాధాన్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రతిసారీ హిందీలోనే మాట్లాడేవారు.

vajpayee-hindi2
వ్యక్తికి సాధికారతను ఇవ్వడం అంటే దేశాన్ని బలోపేతం చేయడమే. వేగవంతమైన ఆర్థికవృద్ధి, వేగవంతమైన సామాజిక మార్పు అనేది సాధికారతతోనే సాధ్యం. మన గమ్యం అనేది అంతంలేని ఆకాశం కంటే కూడా ఉన్నతంగా ఉండాలి.. చేయిచేయి కలిపి ముందుకు సాగాలన్న తీర్మానం నీదైతే విజయం ఇక నీదే.

vajpayee-hindi3
లోకంలో పొందినదేమిటి?
లోకంలో పోగొట్టుకున్నదేమిటి?
కలిసి విడిపోయే బాటలోన
నాకెవరిపైనా నెపం లేదు
గతంపై ఒక చూపును విసురుతూ
జ్ఞాపకాల మూటను తడుముతూ
అడుగుల్లో అడుగులేస్తూనే గెంటుతున్నాను.

712
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles