పాక్ పార్లమెంట్‌కు హిందూ మహిళ!


Tue,February 13, 2018 01:20 AM

కృష్ణకుమారిని నామినేట్ చేయనున్న పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ
Krishna-Kumari
కరాచీ: పాకిస్థాన్‌లో తొలిసారిగా ఓ హిందూ మహిళ పార్లమెంటు సభ్యురాలు కానున్నారు. వచ్చే నెలలో ఎగువసభకు జరిగే ఎన్నికల్లో ప్రతిపక్ష పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) కృష్ణకుమారిని అభ్యర్థినిగా ప్రకటించింది. ఈమేరకు పార్టీ అధికార ప్రతినిధి నాసిర్‌షా సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మన రాజ్యసభ తరహాలో పరోక్ష పద్ధతిన జరిగే ఈ ఎన్నికలు మార్చ్ 3న జరుగనున్నాయి. కృష్ణకుమారికి ఓటువేసి గెలిపించాల్సిందిగా తమ పార్టీ ప్రజాప్రతినిధుల్ని పీపీపీ ఆదేశించింది. పాకిస్థాన్‌లో రాజకీయ పక్షాలు సాధారణంగా ఎగువసభకు సంపన్న వర్గాలకు చెందినవారిని, ప్రముఖులను మాత్రమే నామినేట్ చేస్తుంటాయి. తనను అభ్యర్థిగా ప్రకటించడంపై కృష్ణకుమారి హర్షం వ్యక్తంచేశారు. తమది పేద కుటుంబమని, తాను చట్టసభలోకి వెళ్తానని ఊహించలేదని ఆమె చెప్పారు. 1947లో పాకిస్థాన్ ఏర్పడినప్పటినుంచి ఇప్పటివరకు హిందూమహిళలు ఎవరూ పార్లమెంట్‌కు ఎన్నికవలేదు.

246

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018