చైనా ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం

Tue,April 16, 2019 12:57 AM

Fire in China Pharma Company

-10 మంది మృతి
బీజింగ్, ఏప్రిల్ 15: చైనాలోని షాండాంగ్‌లో ఏర్పాటైన ఫార్మాస్యూటికల్ కంపెనీలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. సోమవా రం మధ్యాహ్నం ఖ్విలు టియాన్హె ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో హీట్ ట్రాన్స్‌ఫరింగ్ పరికరం వద్ద నిప్పు రవ్వలు రావడంతో పొగ కమ్ముకుంది. సంస్థ పైపులైన్ పునరుద్ధరణ పనులు నిర్వహిస్తున్న కార్మికుల్లో ఎనిమిది మంది ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు వైద్య చికిత్స పొందుతూ మృతి చెందారని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. ఊపిరాడక ఫ్యాక్టరీలోనే చిక్కుకుపోయిన 12 మందిని సహాయ సిబ్బంది బయటకు తీశారు. అయితే వారి ప్రాణాలకు ముప్పేమీ లేదు. గత నెల రోజుల్లో చైనాలో ఇది నాలుగో పారిశ్రామిక ప్రమాదం. గత నెల 22న యాంగ్‌చెంగ్‌లోని పెస్టిసైడ్ ఫ్యాక్టరీలో పేలుడుతో 78 మంది మృతి చెందగా, 600 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. గత నెల 30న షాండాగ్‌లోని ఫ్యాక్టరీలో పేలుడు వల్ల ఐదుగురు మృతి చెందారు. 31న జియాన్షు రాష్ట్రంలో స్క్రాప్ మెటల్ మౌల్డింగ్ ప్లాంట్‌లో జరిగిన పేలుడులో ఏడుగురు మరణించగా, ఐదుగురికి గాయాలయ్యాయి.

187
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles