మనసులో మాటలు డైరెక్టుగా ఫేస్‌బుక్‌లోకి!

Fri,April 21, 2017 01:27 AM

facebook
లాస్‌ఏంజెలిస్: ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తపరచటానికి ఒక వేదికలా నిలిచిన ఫేస్‌బుక్.. తన వినియోగదార్లకు మరో వినూత్న సౌకర్యాన్ని కల్పించటానికి కసరత్తు ప్రారంభించింది. ఈ కొత్త సదుపాయం అందుబాటులోకి వస్తే.. ఫేస్‌బుక్ యూజర్లు ఇకమీదట ప్రత్యేకంగా కంపోజ్ చేయాల్సిన అవసరమే ఉండదు. మనసులో మాటలను డైరెక్టుగా ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. అంటే.. మీరు ఏ అభిప్రాయాలనైతే వెల్లడించాలనుకుంటున్నారో.. వాటిని కంపోజ్ చేయకుండానే ఫేస్‌బుక్‌లో వ్యక్తపరచటానికి వీలవుతుందన్నమాట. సైలెంట్ స్పీచ్ సిస్టమ్ పేరుతో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయటంపై ఫేస్‌బుక్ దృష్టి పెట్టింది. ఆ సంస్థ ఏటా నిర్వహించే రెండురోజుల ఆధునిక టెక్నాలజీల సదస్సు ఎఫ్8 కార్యక్రమంలో ఈ వివరాలను వెల్లడించారు.

ఫేస్‌బుక్ సీఈఓ మార్క్‌జుకెర్‌బర్గ్ దీనిపై స్పందిస్తూ.. మన మెదడు ప్రతీ సెకండుకు నాలుగు హైడెఫినేషన్ సినిమాలకు సమానమైన సమాచారాన్ని ఉత్పత్తి చేస్తుంది. కానీ, మాటల ద్వారా మనం వ్యక్తీకరించే సమాచారం అతిస్వల్పం మాత్రమే. సాంకేతికంగా చెప్పాలంటే, 1980ల నాటి మోడెమ్‌కు సమానమైన సమాచారాన్ని మాత్రమే మన మాటలు వ్యక్తీకరించగలుగుతాయి. ఈ నేపథ్యంలో, మెదడు నుంచి డైరెక్టుగా టైప్ చేయటానికి వీలు కల్పించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయటంపై మేం ప్రయత్నాలు ప్రారంభించాం. దీనిద్వారా ప్రస్తుతం మనం టైప్ చేస్తున్నదానికి ఐదురెట్ల వేగంతో కంపోజ్ చేయవచ్చు.

1298
Tags

More News

మరిన్ని వార్తలు...