తల్లి కావటమే అనర్హతా?

Wed,December 4, 2019 02:56 AM

- ‘మిస్‌ వరల్డ్‌' నిబంధనలపై ఉక్రెయిన్‌ మాజీ సుందరి పోరాటం


ఉక్రెయిన్‌: తల్లి అన్న కారణంగా.. తనకు మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనకుండా చేయటంపై ఉక్రెయిన్‌ మాజీ సుందరి వెరోనికా డిడుసెంకో న్యాయపోరాటాన్ని ప్రారంభించారు. మహిళల హక్కులను కాపాడేందుకు ఏకంగా మిస్‌ వరల్డ్‌ పోటీల నియమాలను మార్చాల్సిందేనంటూ ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రాంలో సోమవారం వెల్లడిస్తూ ‘రైట్‌ టు బీ ఏ మదర్‌' (తల్లిగా ఉండే హక్కు కోసం) అనే పేరును ట్యాగ్‌ చేశారు. 2018లో మిస్‌ ఉక్రెయిన్‌ కిరీటాన్ని వెరోనికా సొంతం చేసుకొన్నారు. అయితే ఆమెకు ఐదేండ్ల వయసున్న కుమారుడున్న విషయాన్ని తెలుసుకొన్న నిర్వాహకులు.. ఆమె నుంచి కిరీటాన్ని వెనక్కి తీసుకోవడమేగాక మిస్‌ వరల్డ్‌ పోటీల్లో ఉక్రెయిన్‌ తరఫున పాల్గొనకుండా ఆమెపై నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో దీనిపై ఆమె పోరాటాన్ని ప్రారంభించారు. పెండ్లి చేసుకొన్నవారు కూడా మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పోటీపడేలా నియమాలను సవరించాలని, మిస్‌ ఉక్రెయిన్‌ కిరీటాన్ని తిరిగి తనకు ఇవ్వాల్సిన అవసరం లేదని, మిస్‌ వరల్డ్‌ పోటీల నియమాలను మార్చి న్యాయం చేయాలని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేశారు.

1364
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles