అమెరికాలో మళ్లీ తుపాకీ మోత

Mon,December 2, 2019 02:03 AM

-న్యూ ఆర్లీన్స్‌ నగరంలో కాల్పులు
-11 మందికి గాయాలు..

వాషింగ్టన్‌: అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. న్యూ ఆర్లీన్స్‌ నగరంలోని పర్యాటక హబ్‌ అయిన ఫ్రెంచ్‌ క్వార్టర్‌లో ఆదివారం కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో 11 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నదని పోలీసులు వెల్లడించారు. అత్యంత రద్దీ ఉండే కెనాల్‌ వీధిలో వేకువజామున 3 గంటలకు కాల్పులు చోటుచేసుకున్నాయని వివరించారు. ఏటా నిర్వహించే థ్యాంక్స్‌గివింగ్‌ వీకెండ్‌ యూనివర్సిటీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ కోసం అదనపు గస్తీ బలగాలను మోహరించిన నేపథ్యంలో కాల్పుల ఘటనకు తాము వెంటనే స్పందించామని వివరించారు. ఆ బ్లాక్‌లో ఉన్న తమ పోలీస్‌ అధికారులపైకి కాల్పులు జరిపారేమోనని తొలుత భావించామని పోలీస్‌ సూపరింటెండెంట్‌ షాన్‌ ఫెర్గూసన్‌ తెలిపారు. అయితే, అక్కడ చాలా మంది ప్రజలు బయట ఉండడంతో ఎవరు కాల్పు లు జరిపారో తాము గుర్తించలేకపోయామని చెప్పారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్‌ చేయలేదని, దర్యాప్తు కొనసాగుతున్నదని పేర్కొన్నారు.

415
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles