ఎన్నికల పర్యాటకం!

Mon,March 25, 2019 07:50 AM

Election tourism is here as foreigners get to experience Indias biggest festival of democracy

-విదేశీయుల్ని ఆకర్షిస్తున్నగుజరాతీ టూర్ ఆపరేటర్ల వినూత్న ప్రయోగం
-ఈసారి 2,500 మంది వస్తారని అంచనా

అహ్మదాబాద్: పర్యాటక, సాంస్కృతిక, ఆరో గ్య, ఆధ్యాత్మిక టూరిజాలను మనం చూశాం. ఇప్పుడు సరికొత్తగా ఎన్నికల పర్యాటకం అనే అంశం అందర్నీ ఆకర్షిస్తున్నది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వేడుకైన లోక్‌సభ ఎన్నికలకు భారత్‌లో రంగం సిద్ధమైంది. 130 కోట్ల మంది జనాభా, సుమారు 90 కోట్ల మంది ఓటర్లు, ప్రచార హోరు, సభలు, ర్యాలీలు, పోలింగ్ నిర్వహణ.. ఇంత పెద్ద మహాక్రతువును భారత్ ఎలా నిర్వహిస్తుంది? అనే ఆసక్తి విదేశీయులకు సహజం. దీంతో గుజరాత్‌లో ఎన్నికల పర్యాటకం అనే ఆలోచన పురుడు పోసుకున్నది. 20 మంది టూర్ ఆపరేటర్లు గుజరాత్ టూరిజం డెవలప్‌మెంట్ సొసైటీ (జీటీడీఎస్) పేరుతో యూనియన్‌గా ఏర్పడ్డారు. గుజరాత్‌లో జరిగే లోక్‌సభ ఎన్నికల సమరాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలని పలు దేశాల రాయబార కార్యాలయాలకు టూర్ బ్రోచర్లను పంపారు.

ప్రత్యేక రాయితీలు ప్రకటించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 1,800 మంది విదేశీయులు గుజరాత్‌లో ఎన్నికల్ని ప్రత్యక్షంగా వీక్షించారని జీటీడీఎస్ చైర్మన్ మనీశ్‌శర్మ చెప్పారు. ప్రస్తుత ఎన్నికలకు 2,500 మంది విదేశీయులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జపాన్, యూఏఈ, అమెరికా, ఈయూ దేశాల నుంచి పర్యాటకులు వస్తారని చెప్పారు. పర్యాటకుల్ని గుజరాత్‌లోని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళతాం. ఇక్కడి ప్రధాన సమస్యలు, అభ్యర్థుల వాగ్దానాలను వారు ప్రత్యక్షంగా వీక్షించే ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నికల సభలకు వారిని తీసుకెళ్తాం. అభ్యర్థులతో వారిని మాట్లాడిస్తాం. ప్రధాన పార్టీలు, స్టార్ క్యాంపెయినర్లతోనూ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. ఆరు రోజుల ప్యాకేజీకి రూ.40వేలు, రెండు వారాల ప్యాకే జీకి రూ.లక్షన్నర వసూలు చేస్తాం. ఎన్నికల టూరిజాన్ని 2012 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ప్రవేశపెట్టాం. విద్యార్థులు, పరిశోధకు లు, రాజకీయ విశ్లేషకులు, మీడియా ప్రతినిధులు ఆసక్తి చూపుతారు అని వివరించారు.

783
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles