ఈజిప్ట్‌లో ఇద్దరు జర్మన్ పర్యాటకుల దారుణ హత్య


Sun,July 16, 2017 12:53 AM

కైరో, జూలై 15: ఈజిప్ట్‌లోని ఎర్రసముద్రం బీచ్‌లో ఉన్న రిసార్ట్ వద్ద జర్మనీకి చెందిన ఇద్దరు మహిళా పర్యాటకులను శుక్రవారం ఓ వ్యక్తి దారుణంగా పొడిచి హతమార్చాడు. దాడిలో మరో నలుగురు మహిళలు కూడా గాయపడ్డారు. స్కూబా డైవింగ్‌కు ప్రసిద్ధిచెందిన హుర్ఘాడా వద్ద జరిగిన దాడిలో ఇద్దరు జర్మనీ పర్యాటకులు మృతిచెందడం బాధాకరమని జర్మనీ విదేశాంగశాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. దాడికి పాల్పడిన దుండగుడిని అరెస్టుచేశామని, దాడి వెనుక కారణాలపై ఆరా తీస్తున్నామని ఈజిప్ట్ అంతర్గత మంత్రిత్వశాఖ పేర్కొన్నది. హుర్ఘాడా రిసార్టులో 2016 జనవరిలో అనుమానిత ఐఎస్ ఉగ్రవాదులు.. ముగ్గురు విదేశీ పర్యాటకులను హతమార్చారు.

323
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS