దుబాయ్ విమానాశ్రయంలో రెండు మామిడి పండ్ల దొంగతనం

Sat,September 14, 2019 01:04 AM

Dubai airport worker held for stealing two mangoes

- విచారణను ఎదుర్కొంటున్న భారత సంతతి యువకుడు

దుబాయ్: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పని చేస్తున్న భారత సంతతికి చెంది యువకుడు 2017లో రెండు మామిడి పండ్లు దొంగిలించినందుకు తొలిసారి న్యాయ విచారణను ఎదుర్కొంటున్నారు. అభియోగాలు రుజువైతే అతడికి జైలుశిక్షతోపాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. ఈ నెల 23న న్యాయస్థానం తీర్పు వెలువరిస్తుందని భావిస్తున్నారు. భారత్‌కు వెళ్లే సరుకు రవాణా విమానానికి చెందిన ఒక బ్యాగ్ నుంచి వాటిని దొంగిలించినట్లు అతడు నేరాన్ని అంగీకరించాడు. ఆ సమయంలో దాహంగా ఉండడంతో నీటి కోసం వెతుకుతూ ఫ్రూట్ బాక్స్ తెరిచి రెండు మామిడి పండ్లు తిన్నానని అతడు చెప్పినట్లు వార్తలొచ్చాయి.

450
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles