అమెరికన్ హీరో రొనిల్ రోన్ సింగ్

Thu,January 10, 2019 02:10 AM

Donald Trump told this Indian origin police officer National Hero

అక్రమ వలసదారుడి కాల్పుల్లో మరణించిన భారత సంతతి పోలీసుపై అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు
వాషింగ్టన్: కాలిఫోర్నియాలో గత నెల 26న మెక్సికో అక్రమ వలసదారుడు జరిపిన కాల్పుల్లో మరణించిన భారత సంతతి పోలీస్ రొనిల్ రోన్ సింగ్ తమ హీరో అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనియాడా రు. బుధవారం ట్రంప్ తన అధికార నివా సం ఓవల్ ఆఫీస్ నుంచి తొలిసారి జాతినుద్దేశించి మాట్లాడారు. క్రిస్మస్ మరుసటి రోజు యువ పోలీస్ హత్య కావడంతో అమెరికా గుండె పగిలింది. ఇది అక్రమంగా వలస వచ్చిన వ్యక్తి వల్లే జరిగింది అని అన్నారు. ఫిజీ నుంచి వచ్చి 2011లో అమెరికా పోలీసుశాఖలో చేరిన రొనిల్ సింగ్ కుటుంబ సభ్యులను, సహచర సిబ్బందిని గత గురువారం ట్రంప్ పరామర్శించారు. యువ పోలీస్ హత్యకు, మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి సంబంధం ఉన్నదన్నారు. సరిహద్దు భద్రతకు నిధులను కేటాయించేందుకు డెమోక్రాట్లు అనుమతించనందుకే ఫెడరల్ ప్రభుత్వ షట్ డౌన్ కొనసాగుతున్నదన్నారు.
Trump

914
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles