కశ్మీర్‌ మధ్యవర్తిత్వంపై వెనక్కి తగ్గిన ట్రంప్‌

Wed,August 14, 2019 01:26 AM

Donald Trump takes U turn on offer to mediate in Kashmir dispute

-భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక అంశమే అన్నారు: అమెరికాలో భారత్‌ రాయబారి శ్రింగ్లా
వాషింగ్టన్‌: కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహించే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెనుకకు తగ్గినట్లు తెలుస్తున్నది. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహించరాదని దశాబ్దాలుగా అమెరికా అనుసరిస్తున్న విధానమని, ఆ సమస్యను భారత్‌, పాకిస్థాన్‌ ద్వైపాక్షికంగా పరిష్కరించుకునేందుకు అమెరికా ప్రోత్సహిస్తుందని ట్రంప్‌ తెలిపారని అమెరికాలో భారత్‌ రాయబారి హర్ష్‌వర్ధన్‌ శ్రింగ్లా సోమవారం చెప్పారు. ‘భారత్‌, పాక్‌ అంగీకారంపైనే కశ్మీర్‌పై అమెరికా మధ్యవర్తిత్వం ప్రతిపాదన ఆధారపడి ఉంది. భారత్‌ ఆమోదించనందున అది ఇక ఎంతమాత్రం చర్చకు రాదని ట్రంప్‌ స్పష్టం చేశారు’ అని ఫాక్స్‌ న్యూస్‌ చానెల్‌ ఇంటర్వ్యూలో శ్రింగ్లా అన్నారు. మరోవైపు ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్‌ సైతం దీనిపై స్పష్టమైన వైఖరి కలిగి ఉన్నారని శ్రింగ్లా తెలిపారు. ‘సిమ్లా, లాహోర్‌ డిక్లరేషన్‌ ఆధారంగా కశ్మీర్‌ అంశాన్ని పరిష్కరించుకోవాలి అని ఆయన స్పష్టం చేశారు’ అని అన్నారు.

281
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles