అమెరికాకు భారత్, చైనా చెత్త

Thu,November 14, 2019 02:04 AM

డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం
న్యూయార్క్: చైనా, భారత్, రష్యా వంటి దేశాలు సముద్రంలో పడేస్తున్న చెత్తంతా లాస్ ఏంజిల్స్‌కు చేరుతున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ దేశాలు తమ పారిశ్రామిక ప్లాంట్లు, పొగ కారక గొట్టాలను శుభ్రపరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. పర్యావరణ మార్పులను చాలా సంక్లిష్టమైన అంశంగా అభివర్ణించిన ట్రంప్.. తనకు తాను పర్యావరణవేత్తగా చెప్పుకొన్నారు. న్యూయార్క్‌లో మంగళవారం జరిగిన ఎకనమిక్ క్లబ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిస్ పర్యావరణ ఒప్పందం ఏకపక్షమైనదని, దారుణమైనదని విమర్శలు గుప్పించారు.


ట్రంప్ అభిశంసన ప్రక్రియ ప్రారంభం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తొలి అభిశంసన ప్రక్రి యను ఆ దేశ ప్రజాప్రతినిధుల సభ బుధవారం చేపట్టింది. ఈ సభలో ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీదే ఆధిపత్యం. అధ్యక్షుడు ట్రంప్ తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఉక్రెయిన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారన్న అభియోగాలపై ఇద్దరు దౌత్యవేత్తల వాంగ్మూలాలను హౌస్ పర్మనెంట్ సెలెక్ట్ కమిటీ ఆన్ ఇంటెలిజెన్స్ చైర్మన్ ఆడమ్ స్కిఫ్ నమోదు చేశారు.

2278
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles