అడుగడుగునా అసహనమే

Sun,January 13, 2019 01:59 AM

Do not want an India where journalists are shot people beaten for  having opinions

-పాలకుల ఆలోచనా ధోరణే కారణం
-భిన్నాభిప్రాయాలను చెప్పేవారిని చావబాదే, జర్నలిస్టులను హత్యచేసే భారత్ మనకొద్దు
-యూఏఈ పర్యటనలో రెండోరోజు మోదీ సర్కారుపై రాహుల్ ధ్వజం

దుబాయ్: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో గత నాలుగున్నరేండ్ల నుంచి అసహనం, ఆగ్రహం అధిక స్థాయిలో కనిపిస్తున్నదని, అధికారంలో ఉన్న వ్యక్తుల ఆలోచనా ధోరణే ఇందుకు కారణమని విమర్శించారు. భిన్నమైన వివిధ భావనలను భారత్ విలీనం చేసుకోగలదని, ఒకే రకమైన భావనను ప్రజలపై బలవంతంగా రుద్దేందుకు ఎన్నడూ ప్రయత్నించలేదని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రవాస భారతీయులకు చేరువ కావాలన్న ప్రయత్నంలో భాగంగా తొలిసారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ శనివారం ఐఎంటీ దుబాయ్ యూనివర్సిటీ విద్యార్థులతో ముచ్చటించారు.

సహనం మన సంస్కృతిలోనే ఉన్నది. కానీ గత నాలుగున్నరేండ్ల నుంచి దేశంలో జరుగుతున్న పరిణామాలు విచారాన్ని కలిగిస్తున్నాయి. దేశంలో ఎటు చూసినా అసహనం, ఆగ్రహం, సామాజిక వర్గాల మధ్య చీలికలే కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న వ్యక్తుల మానసిక వైఖరే ఇందుకు కారణమని స్పష్టమవుతున్నది. నాయకులు సహనశీలురైతే వారు సహనంతో వ్యవహరించి ఆ సందేశాన్ని వ్యాప్తి చేయగలుగుతారు. లేకపోతే అడుగడుగునా అసహనం రాజ్యమేలుతుంది. దేశంలో ఇప్పుడు జరుగుతున్నది ఇదే అని రాహుల్ అన్నారు. భిన్నాభిప్రాయాలను చెప్పినవారిని చావబాదే, జర్నలిస్టులను హత్యచేసే భారత దేశాన్ని మనం ఆకాంక్షించడం లేదని, ఈ పరిస్థితిలో మార్పు రావాలని అన్నారు.

594
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles