డైనోసార్ల కాలం నాటి స్నేక్ షార్క్ బతికే ఉంది!


Tue,November 14, 2017 01:45 AM

dinosaurshark
వాషింగ్టన్: రాక్షసబల్లుల కాలానికి చెందిన అరుదైన జాతి షార్క్ పోర్చుగల్ తీరంలో కనిపించింది. పామును పోలిన తలతో, 300 దంతాలతో ఆ షార్క్ ఇప్పటికీ అట్లాంటిక్ సముద్రంలో తిరుగాడుతున్నది. ఆరడుగుల పొడవున్న ఈ స్నేక్‌షార్క్ జాతి 8కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్ల కాలానికి చెందినది. కాలక్రమంలో డైనోసార్లు, టైరనోసార్లతోపాటు స్నేక్ షార్క్‌లు కూడా అంతరించిపోయాయని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా అది సజీవంగా కనిపించడం ఆసక్తిరేపుతున్నది. అల్గర్వే తీరంలో యూరోపియన్ యూనియన్ పరిశోధకుల బృందం 701 మీటర్ల లోతున ఈ స్నేక్ షార్క్‌ను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. దీనిని సజీవ శిలాజంగా పేర్కొన్న వారు.. క్లమిడోస్లేచస్ యాం గినస్‌గా దీనికి నామకరణం చేశారు. ఇవి 25 వరుసల్లో 300 పదునైన దంతాలను కలిగి ఉన్నట్లు గుర్తించారు. అవి ఇతర షార్క్‌లు, చేపలు, ఆక్టోపస్‌ల శరీరాలను చీల్చి ఆహారంగా తీసుకుంటాయని అల్గర్వే యూనివర్సిటీకి పరిశోధకులు తెలిపారు. దాని దంతాల అమరిక ఆధారంగానే స్నేక్ షార్క్‌కు నామకరణం చేసినట్లు చెప్పారు. జపాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సముద్ర తీరాల్లో స్నేక్ షార్క్ నివాసముంటున్నట్లు చెప్పారు.

316

More News

VIRAL NEWS