319కి చేరినభూకంప మృతుల సంఖ్య

Fri,August 10, 2018 12:32 AM

Death toll in Indonesia earthquake reaches 319

-ఇండోనేషియాలో గురువారం మరోమారు ప్రకంపనలు
మాతారం: ఇండోనేషియాలోని లాంబాక్ దీవి పరిధిలో సంభవించిన భూకంపం వల్ల మరణించిన వారి సంఖ్య 319 మందికి చేరుకున్నదని ఆ దేశ ముఖ్య భద్రతా వ్యవహారాలశాఖ మంత్రి విరాంటో గురువారం చెప్పారు. 1,400 మందికి తీవ్ర గాయాలు కాగా, 1.50 లక్షల మందికిపైగా నిర్వాసితులయ్యారని అధికార వర్గాలు తెలిపాయి. గురువారం భూమి కంపించడంతో ప్రజలంతా కేకలు, అరుపులతో సహాయ శిబిరాల్లోకి పరుగులు తీశారు. ఆదివారం సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.9గా నమోదైన సంగతి తెలిసిందే.

253
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS