హగిబిస్‌తో జపాన్ అతలాకుతలం

Sun,October 13, 2019 02:46 AM

టోక్యో, ఫుజిసావా: తుఫాన్ హగిబిస్ శనివారం సాయంత్రం జపాన్‌లోని షిజ్యుకా ప్రాంతంలో తీరం దాటింది. దీంతో భారీ వర్షాలు కురిసి దేశంలోని పలు నగరాలు, పట్టణాలు జలమయమయ్యాయి. రాజధాని టోక్యోపై తీవ్ర ప్రభావం పడింది. గంటకు 216 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచాయి. వివిధ ఘటనల్లో ఇద్దరు మరణించగా.. పలువురు గల్లంతయ్యారు. 80 మందికిపైగా గాయపడ్డారు. టోక్యోలో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జపాన్ వాతావరణ విభాగం అధికారి యాసూశి కజిహర మాట్లాడుతూ తుఫాన్ తీవ్రతను చూస్తుంటే ప్రకృతి వైపరీత్యం సంభవించేలా ఉన్నదన్నారు.


టోక్యో, దాని చుట్టుపక్కల ఇంతకుముందు ఎన్నడూ చూడనంత భారీ వర్షం కురిసే అవకాశముందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 1958లో టోక్యోలో సంభవించిన తుఫానుకు హగిబిస్‌కు దగ్గరి పోలిక ఉన్నదని తెలిపారు. ఆ తుఫాను కారణంగా 5 లక్షల ఇండ్లు నేలమట్టమయ్యాయని, 1,200 కంటే ఎక్కువమంది చనిపోయారని గుర్తుచేశారు. మరోవైపు శనివారం టోక్యో సమీపంలోని ఛీబా తీరంలో రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం వచ్చింది.

341
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles