క్యూబా విప్లవానికి 60 ఏండ్లు

Thu,January 3, 2019 01:31 AM

Cuba celebrates 60 years since Castros communist revolution

హవానా, జనవరి 2: క్యూబా విప్లవానికి మంగళవారంతో 60 ఏండ్లు పూర్తయ్యాయి. దీంతో ఆ దేశం ఘనంగా వేడుకలను నిర్వహించింది. కాస్ట్రోయేతరుల పాలనలో వేడుకలు నిర్వహిస్తుండడం ఇదే మొదటిసారి. క్రేడిల్ ఆఫ్ ది రెవల్యూషన్‌గా పిలిచే శాంటియాగో డి క్యూబాలో సంస్మరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి రౌల్ కాస్ట్రో హాజరయ్యారు. దేశ వీరులు జోస్ మార్టీ, ఫిడెల్ క్యాస్ట్రో సమాధుల వద్ద ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. గతేడాది ఏప్రిల్‌లో దేశాధ్యక్షుడిగా మిగ్వెల్ డియాజ్ కానెల్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అమెరికా మద్దతుతో పాలన సాగించిన నియంత బటిస్టా.. విప్లవం నేపథ్యంలో 1958 డిసెంబర్ 31న దేశాన్ని విడిచి పారిపోయారు. దీంతో 1959 జనవరి 1న ఫిడెల్ కాస్ట్రో దేశంలో ఏకపార్టీ కమ్యూనిస్టు పాలనకు నాందిపలికారు.

977
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles