సిరియాలో ఘర్షణ.. 18 మంది మృతి

Sun,September 9, 2018 12:02 AM

Clashes between Kurds and Syrian army troops leave 18 dead

ఖ్వామిష్లీ: సిరియాలోని ఈశాన్య ప్రాంత నగరం ఖ్వామిష్లీలో శనివారం తిరుగుబాటు కుర్దిష్ బలగాలకు సిరియా ప్రభుత్వ బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో 18 మంది మృతి చెందారు. వారిలో 11 మంది ప్రభుత్వ అనుకూల సైనికులు కాగా, మిగతా వారు కుర్దిష్ జవాన్లు ఉన్నారని ఆషాయేష్ ఒక ప్రకటనలో తెలిపింది. టర్కీ సరిహద్దుల్లో గల ఈ నగర శివార్లలో కుర్దిష్ చెక్ పాయింట్ వద్ద ప్రభుత్వ సైనికుల పెట్రోలింగ్ వాహనాన్ని నిలిపేయాలని కుర్దిష్ సైనికులు కోరారు. అందుకు ప్రభుత్వ సైనికులు నిరాకరించడంతో ఇరు పక్షాలు కాల్పులకు దిగాయని సిరియా మానవ హక్కుల అబ్జర్వేటరీ పేర్కొంది. ఖ్వామిష్లీ నగరంపై కుర్దిష్ సైన్యానికి పట్టు ఉండగా, ప్రభుత్వ సైన్యం ఆధీనంలో విమానాశ్రయం ఉంది.

369
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles