చైనాలో నది అంతర్భాగంలో భారీ నిధి

Tue,March 21, 2017 02:34 AM

Sichuan బీజింగ్: చైనాలోని సిచువాన్ రాష్ట్రంలో ఉన్న మిన్‌జియాంగ్ నది అంతర్భాగంలో భారీ నిధిని కనుగొన్నామని ఆ దేశ పురాతత్వ పరిశోధకులు సోమవారం తెలిపారు. ఈ నిధి నుంచి దాదాపు 10వేలకుపైగా బంగారం, వెండి వస్తువులను సేకరించామని చెప్పారు. నది అంతర్భాగంలో దాదాపు 300ఏండ్ల నుంచి ఈ నిధి ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ నిధిలో భారీ మొత్తంలో బంగా రు, వెండి, కాంస్య నాణెలు, ఇనుముతో తయారుచేసిన ఆయుధాలు, కత్తులు ఉన్నట్టు సిచువాన్‌లోని పురావస్తు పరిశోధన సంస్థ డైరెక్టర్ గావో దలూన్ చెప్పారు. 1646లో మింగ్ రాజవంశం చేతిలో జాంగ్ జియాన్‌జాంగ్ ఓడిపోవడంతో సైనికులు దాదాపు 1000 పడవల్లో నిధిని దక్షిణ ప్రాంతానికి తరలిస్తుండగా నదిలో మునిగిపోయి ఉండవచ్చని తెలిపారు. పెకింగ్ యూనివర్సిటీ పురావస్తు నిపుణుడు లీ బొక్యూయాన్ మాట్లాడుతూ, చారిత్రక ఆధారాలను వెలికితీయడానికి ఈ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

3002

More News

మరిన్ని వార్తలు...