కమ్యూనిస్టు చైనాలో కుబేరులు


Fri,October 13, 2017 02:08 AM

Xu-Jiayin
బీజింగ్, అక్టోబర్ 12: కమ్యూనిస్టు చైనాలో సంపన్నుల ఆస్తులు కొండలను తలపిస్తున్నాయి. అవినీతికి వ్యతిరేకంగా ముమ్మర చర్యలు తీసుకుంటున్నామని అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ చెప్తున్నప్పటికీ దేశంలో ధనవంతుల సంపద 2.6 లక్షల కోట్ల డాలర్లకు పెరిగినట్లు తాజా నివేదిక వివరించింది. చైనా లో ప్రస్తుతం వేలకోట్ల డాలర్ల ఆస్తులు ఉన్న వారు 2,130 ఉన్నట్టు ఆ నివేదిక తెలిపింది. వీరిలో ఈ ఏడాది కొత్తగా 74 మంది చేరారని పేర్కొంది. రియల్ ఎస్టేట్ డెవలపర్ ఎవర్‌గ్రాండే గ్రూపు చైర్మన్ గ్సూ జియాయిన్ 4.3 వేల కోట్ల డాలర్ల ఆస్తులతో చైనాలో అత్యంత ధనవంతుడైన వ్యక్తిగా నిలిచారు. గత ఏడాది టాపర్‌గా నిలిచిన వాంగ్ జియాన్‌లిన్‌ను గ్సూ వెనక్కి నెట్టారు. ఈ ఏడాది కొత్తగా సంపన్నులైన 74 మంది ఆస్తులు 30 కోట్ల డాలర్లకు పైనే ఉంటుందని ఆ నివేదిక తెలిపింది. చైనాలో సంపన్నుల ఆస్తుల విలువ (2.6 లక్షల కోట్ల డాలర్లు) ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన బ్రిటన్ స్థూల దేశీయ ఉత్పత్తితో సమానమని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక తెలిపింది.

262

More News

VIRAL NEWS