చైనా చేతిలో అత్యాధునిక నేవీ రాడార్

Thu,January 10, 2019 02:08 AM

Chinas new naval radar can monitor areas size of India

బీజింగ్: చిన్న సైజులో ఉండే అత్యాధునిక మారిటైమ్ రాడార్‌ను చైనా అభివృద్ధి చేసింది. భారత దేశ భూభాగం కన్నా పెద్ద ప్రాంతంపైన కూడా ఈ రాడార్ నిఘా పెట్టగలదని హాంకాంగ్ నుంచి వెలువడే సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక బుధవారం వెల్లడించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ రాడార్.. చైనా నౌకాదళానికి మరింత శక్తినిస్తుందని, చైనా సముద్రాలపై పూర్తిస్థాయి పర్యవేక్షణ కొనసాగించేందుకు తోడ్పడుతుందని, శత్రు దేశాల నౌకలు, విమానాలు, క్షిపణుల నుంచి ఎదురయ్యే ప్రమాదాలను ఈ రాడార్ మరింత సమర్ధంగా పసిగట్టగలుతుందని ఆ పత్రిక వివరించింది.

1208
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles