పాక్‌కు సాయుధ డ్రోన్లను విక్రయించనున్న చైనా

Wed,October 10, 2018 12:40 AM

China to sell 48 armed drones to Pakistan

బీజింగ్: తన మిత్ర దేశమైన పాకిస్థాన్‌కు 48 అత్యాధునిక సాయుధ డ్రోన్లను (వింగ్ లూంగ్-2) విక్రయించాలని చైనా నిర్ణయించింది. ఈ ఒప్పందం గనుక పూర్తయితే సాయుధ డ్రోన్ల విక్రయాలకు సంబంధించి ఇది అతిపెద్ద ఒప్పందంగా నిలుస్తుందని ఓ మిలిటరీ పరిశీలకుడు తెలిపినట్టు చైనా ప్రభుత్వ అధికారిక మీడియా వెల్లడించింది. అత్యాధునిక నిఘా డ్రోన్ అయిన వింగ్ లూంగ్-2 దాడులు చేయడంతోపాటు బహుళ వినియోగ మానవ రహిత గగనతల వ్యవస్థగా పనిచేస్తుంది. గగనతలం నుంచి భూ ఉపరితలంపైకి ప్రయోగించే వివిధ రకాల ఆయుధాలకు కూడా దీనిని బిగించవచ్చు.

453
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles