సగానికి తగ్గిన చైనా సైనికుల సంఖ్య

Wed,January 23, 2019 01:17 AM

సంస్కరణల్లో భాగంగా నౌకాదళం, వాయుసేన విస్తరణ
వాషింగ్టన్: ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం (దాదాపు 20 లక్షల మంది సైనికులను) కలిగివున్న చైనా.. తన పదాతిదళ పరిమాణాన్ని దాదాపు సగానికి కుదించుకున్నది. అయితే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ)ని సమగ్రమైన ఆధునిక సైనిక శక్తిగా మార్చుకోవాలన్న వ్యూహంలో భాగంగా చైనా తన వైమానిక, నౌకా దళాల పరిమాణాన్ని గణనీయంగా పెంచుకున్నట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక పేర్కొన్నది. చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువాను ఉటంకిస్తూ ఆ పత్రిక ఈ విషయాన్ని తెలిపింది. ప్రస్తుతం మొత్తం పీఎల్‌ఏ బలగాల్లో సైనికుల సంఖ్య 50 శాతం కంటే తక్కువగా ఉన్నదని జిన్హువా తెలిపింది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ చేపట్టిన సైనిక సంస్కరణల్లో భాగంగా పీఎల్‌ఏ కొన్నేండ్లుగా మూడు లక్షల మంది సైనికులను తొలిగించిందని, అయినా ఇప్పటికీ పీఎల్‌ఏ 20 లక్షల మంది సిబ్బందితో ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తిగా కొనసాగుతున్నదని జిన్హువా తెలిపింది. గత కొన్నేండ్లలో చైనా తన నౌకా దళాన్ని గణనీయంగా విస్తరించింది. ప్రస్తుతం ఓ విమాన వాహక నౌకను కలిగివున్న చైనా.. మరో దానిని పరీక్షిస్తున్నది. ఇంకో విమాన వాహక నౌక నిర్మాణ దశలో ఉన్నది. కనీసం ఐదారు విమాన వాహక నౌకలను కలిగి ఉండాలని చైనా భావిస్తున్నట్టు అధికారిక మీడియా వెల్లడించింది.

1075
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles