ప్రపంచంలో అతిపెద్ద ఐస్‌క్రీమ్ ఉత్పత్తిదారు చైనా


Fri,October 13, 2017 02:21 AM

అమెరికాను దాటేసిన డ్రాగన్
China-icecream
బీజింగ్: ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్‌క్రీమ్ ఉత్పత్తిదారుగా ఖ్యాతిగాంచిన అమెరికాను చైనా దాటేసింది. ఈ మేరకు ఉత్తరచైనా టియాన్‌జిన్ నగరంలోని ఓ పరిశ్రమ ప్రదర్శనలో గణాంకాలను ప్రచురించారు. 2016లో చైనా 33 లక్షల టన్నుల ఐస్ ఆహార పదార్థాల విక్రయం ద్వారా 660 కోట్ల డాలర్ల ఆదాయం గడించిందని చైనా శీతల ఆహార కమిటీ ప్రతినిధి తెలిపారు. చిన్న ఉత్పత్తిదారుల ఉత్పత్తులను కలుపుకొని చైనా మొత్తం ఉత్పత్తి చేసిన ఐస్‌క్రీమ్‌తో లెక్కిస్తే అమెరికాను అధిగమించినట్టు ఆయన పేర్కొన్నారు. అయితే, అమెరికా ఐస్‌క్రీమ్ ఉత్పత్తి గణాంకాలను వెల్లడించలేదు. చైనా తలసరి ఐస్‌క్రీమ్ వినియోగం 20 ఏండ్ల క్రితం ఒక లీటర్ ఉంటే.. 2016లో అది మూడు లీటర్లకు పెరిగింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే చైనాలో ఐస్‌క్రీమ్ ఉత్పత్తి పరిశ్రమ ఇంకా యవ్వన దశలోనే ఉందని, దాని పెరుగుదలకు చాలా అవకాశాలు ఉన్నాయని చైనా శీతల ఆహార కమిటీ ప్రతినిధి పేర్కొన్నారు.

249

More News

VIRAL NEWS