చైనాలోనూ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్

Fri,January 4, 2019 11:52 PM

China is also the mother of all bombs

-అమెరికాకు దీటుగా భారీ బాంబు తయారీ
బీజింగ్, జనవరి 4: అమెరికాకు దీటుగా చైనా కూడా ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటున్నది. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ పేరిట అమెరికా తయారుచేసిన భారీ బాంబుకు పోటీగా చైనా మరో బాంబును అభివృద్ధి చేసింది. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌కు చైనీస్ వర్షన్‌గా దీన్ని అభివర్ణిస్తున్నారు. చైనా రక్షణ రంగ దిగ్గజం చైనా నార్త్ ఇండస్ట్రీస్ గ్రూప్ కార్పొరేషన్ లిమిటెడ్ (నోరింకో) ఈ అణ్వస్త్ర రహిత బాంబ్‌ను అభివృద్ధి చేసింది. హెచ్-6కే బాంబర్ ద్వారా దీన్ని ప్రయోగించగా భారీ పేలుడు సంభవించింది. ఇందు కు సంబంధించిన వీడియోను నోరింకో తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. చైనా తయారు చేసిన బాంబు అమెరికా బాంబు కంటే చిన్నదని, తక్కువ బరువు ఉంటుందని చైనాకు చెందిన మిలిటరీ విశ్లేషకులు వీ డాంగ్జూ తెలిపారు. అమెరికా బాంబు చాలా బరువు ఉండడంతో దాన్ని మోసుకెళ్లేందుకు భారీ యుద్ధ విమానం అవసరమవుతుందని వివరించారు. అదే చైనా బాంబ్‌ను బాంబర్ (చిన్న యుద్ధ విమానం) ద్వారా ప్రయోగించవచ్చని చెప్పారు.

414
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles