ఆన్‌లైన్ గేవ్‌‌సు ఆటపై చైనా కర్ఫ్యూ

Fri,November 8, 2019 01:19 AM

-రాత్రి 10 నుంచి ఉదయం 8 గంటల మధ్య గేవ్‌‌సు ఆడొద్దన్న ప్రభుత్వం

బీజింగ్: రోజురోజుకూ తీవ్రమవుతున్న ఆన్‌లైన్ వీడియో గేవ్‌ు వ్యసనం నియంత్రణకు చైనా పటిష్ఠ చర్యలకు పూనుకుంది. దీన్ని అదుపు చేసేందుకు మైనర్ పిల్లలు ఆన్‌లైన్ గేవ్‌‌సు ఆడే సమయంపై కర్ఫ్యూ విధించింది. దీని ప్రకారం 18 ఏండ్ల లోపు పిల్లలు రాత్రి 10 నుంచి ఉదయం 8 గంటల మధ్య ఆన్‌లైన్ గేవ్‌‌సు ఆడడంపై నిషేధం విధించారు. రోజూ 90 నిమిషాలే వీడియో గేవ్‌‌సు ఆడుకోడానికి అనుమతిస్తారు. మంగళవారం జారీ చేసిన మార్గనిర్దేశకాల్లో ఆన్‌లైన్ గేవ్‌‌సు కోసం మైనర్లు ఖర్చు చేస్తున్న మొత్తంపైనా ప్రభుత్వం పరిమితులు విధించింది. 16-18 ఏండ్ల వయసు పిల్లలు ఆన్‌లైన్ గేవ్‌‌సు కోసం నెలకు 400 యువాన్ల (సుమారు రూ.4000) వరకు ఖర్చు చేయవచ్చు. మిగతా వయసు పిల్లల గేమింగ్ ఖాతాలపై నెలకు 200 యువాన్ల(సుమారు రూ. 2000) వరకు ఖర్చు చేయవచ్చు. ఆన్‌లైన్ గేవ్‌‌సు ఆడే పిల్లలు అసలు పేరుతోనే వారి ఆన్‌లైన్ గేమింగ్ ఖాతాల్లోకి సైన్‌అప్ అవ్వాలని, దీని కోసం వీచాట్ అకౌంట్, ఫోన్ నంబర్ లేదా ఏదైనా చెల్లుబాటు ఐడీ నంబర్‌ను వాడాలని తెలిపారు. ఇప్పటివరకు ఉన్న ఆన్‌లైన్ గేవ్‌‌సు కంటెంట్, గేవ్‌‌సు నిబంధనలను మార్చాలని ఆయా గేమింగ్ ప్లాట్‌ఫాం సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో గేవ్‌ు ఇండస్ట్రీగా చైనాకు పేరుంది.

490
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles