గడ్డకట్టిన నదిలో పడిన బస్సు 19 మంది మృతి

Mon,December 2, 2019 12:50 AM

మాస్కో, డిసెంబర్‌ 1: రష్యాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మరణించారు. 22 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం తూర్పు సైబీరియా ప్రాంతంలో చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు క్వూంగా నదిపై ఉన్న వంతెనను దాటుతున్న సమయంలో దాని ముందు టైర్‌ పంక్చర్‌ కావడంతో డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు వంతెన మీద నుంచి నదిలో పడిపోయింది. అయితే శీతాకాలం కావడంతో నది గడ్డకట్టి ఉన్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగింది. ప్రమాదంలో బస్సు పూర్తిగా బోల్తాపడటంతో ధ్వంసమైంది.

1012
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles