ఉగ్రదాడితో ఉలిక్కిపడ్డ పారిస్


Mon,May 14, 2018 01:14 AM

-కత్తితో ఉగ్రవాది దాడి.. ఒకరు మృతి
-దుండగుడిని కాల్చి చంపిన పోలీసులు

పారిస్, మే 13: ఉగ్రదాడితో ఫ్రాన్స్ రాజధాని పారిస్ మరోసారి ఉలిక్కి పడింది. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి సెంట్రల్ పారిస్‌లో ఈ ఉగ్రదాడి జరిగింది. ఓ ఉగ్రవాది కత్తితో పౌరులపై విచక్షణా రహితంగా దాడులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, మరో నలుగురు గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఉగ్రవాదిని కాల్చి చంపాయి. నిందితుడు రష్యాలో జన్మించాడని, అనుమానిత ఉగ్రవాదుల జాబితాలో అతడి పేరు కూడా ఉన్నదని ఫ్రాన్స్ పరిశోధన అధికారులు ఆదివారం తెలిపారు. సెంట్రల్ పారిస్‌లోని ఓపెరాహౌస్.. బార్లు, రెస్టారెంట్లు, రిటైల్ స్టోర్లతో నిత్యం దేశ, విదేశీ పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. వారాంతం కావడంతో ప్రజలు పెద్దఎత్తున అక్కడ గుమికూడారు. ఇంతలో ఓ యువకుడు (20) అల్లాహ్ అక్బర్ అని నినాదాలుచేస్తూ ఎదురుగా ఉన్నవారిపై కత్తితో దాడిచేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న రెస్టారెంట్‌లో వెళ్తేందుకు ప్రయత్నించగా జనం అధికంగా ఉండటంతో వీలుపడలేదు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఈ ఘటనకు తమదే బాధ్యతని ఐఎస్ ప్రకటించింది.

1096

More News

VIRAL NEWS