బ్రెగ్జిట్ బిల్లుకు బ్రిటన్ ఆమోదం


Wed,September 13, 2017 01:07 AM

- సవరణలు కోరిన అధికార, ప్రతిపక్ష సభ్యులు
- ప్రధాని థెరెసా మే హర్షం
లండన్ : ప్రధాని థెరెసా మే నాయకత్వంలోని బ్రిటన్ సర్కారు బ్రెగ్జిట్‌పై హౌస్ ఆఫ్ కామన్స్‌లో రెండో దఫా చర్చలో విజయం సాధించింది. యూరోపియన్ యూనియన్(ఈయూ)లో బ్రిటన్ సభ్యత్వాన్ని ఉపసంహరించుకునేందుకు(బ్రెగ్జిట్)రూపొందించిన బి ల్లుకు అనుకూలంగా బ్రిటన్ ఎంపీలు మంగళవారం ఓటు వేశారు. 326-290 ఓట్లతేడాతో బిల్లును ఆమోదించారు. అయినా పలు సవరణలు చేయాలని పలువురు అధికార, ప్రతిపక్ష సభ్యులు అన్నారు. దరిమిలా బ్రెగ్జిట్ అంశాన్ని పార్లమెంటు కమిటీ మరింత లోతుగా పరిశీలించనున్నది. ఈ బిల్లు ఆమోదం దరిమిలా 2019 మార్చిలో ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగే రోజు (బ్రెగ్జిట్‌డే) నాటికి ప్రస్తుతమున్న ఈయూ చట్టాలన్నీ బ్రిటన్ చట్టాలుగా మారుతాయి. బ్రెగ్జిట్ కోసం పోరాడుతున్న ప్రధానమంత్రి థెరెసా ఇది చారిత్రాత్మక నిర్ణయం అని హర్షం వ్యక్తం చేశారు.

461

More News

VIRAL NEWS