అమెరికాపై ‘బాంబ్ సైక్లోన్’!

Fri,March 15, 2019 03:21 AM

-25 రాష్ర్టాలు అస్తవ్యస్తం..
-అంధకారంలో లక్షల కుటుంబాలు
-కొలరాడోలో 1339 విమానాల రద్దు

చికాగో/ డెన్వర్, మార్చి 14: భారీ వర్షాలు, హిమపాతం, చలిగాలులతో అమెరికాలోని 25 రాష్ర్టాలు గజగజ వణుకుతున్నాయి. హిమపాతం వల్ల కొలరాడో రాష్ట్ర పరిధిలో బుధవారం 1339 విమాన సర్వీసులు రద్దయ్యాయి. గంటకు 90 మైళ్ల వేగంతో ఈదురు గాలులు వీస్తుండటంతో కొలరాడో, వ్యోమింగ్, నెబ్రాస్కా, అయోవా రాష్ర్టాల పరిధిలోని రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ తుఫాన్‌కు అమెరికా వాతావరణశాఖ బాంబ్ సైక్లోన్ అని పేరు పెట్టింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను బలవంతంగా సురక్షిత ప్రదేశాలకు తరలించారు. కొలరాడో గవర్నర్ జారెడ్ పొలిస్ ఎమర్జెన్సీ ప్రకటించారు. సహాయ చర్యల కోసం చేయూతనివ్వాలని నేషనల్ గార్డ్ విభాగాన్ని అభ్యర్థించారు. మంచు కురుస్తుండటంతో పలు ఇండ్లు దెబ్బతిన్నాయి. పిడుగులు కూడా పడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా లేకపోవడంతో సుమారు నాలుగు లక్షల కుటుంబాలు అంధకారంలో మగ్గుతున్నాయని ఎక్సెల్ ఎనర్జీ సంస్థ తెలిపింది.

801
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles