రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి.. జుట్టుకత్తిరించి..

Sat,November 9, 2019 02:10 AM

-బొలీవియాలో మహిళా మేయర్‌ పై అమానుషం

లా పాజ్, నవంబర్ 8: దక్షిణ అమెరికా దేశమైన బొలీవియాలో ఓ మహిళా మేయర్‌పై కొందరు అమానుషంగా ప్రవర్తించారు. కొచాబాంబ పట్టణ మేయర్ పేట్రిసియా ఆర్సే, ఓ విద్యార్థి మృతికి కారణమని ఆరోపిస్తూ ముసుగులు ధరించిన కొందరు ఆందోళనకారులు గురువారం ఆమెను బలవంతంగా కార్యాలయం నుంచి రోడ్డుపైకి ఈడ్చుకొచ్చారు. హంతకురాలని నినాదాలు చేస్తూ ఆమెను మోకాళ్లపై కూర్చోపెట్టి జుట్టును కత్తిరించారు. ఆర్సే ముఖంతోపాటు ఒంటిపై ఎరుపురంగు గుమ్మరించారు. చెప్పులు లేకుండా రోడ్డుపై నడిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని ఆమెను దవాఖానకు తరలించారు.

320
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles