0.38 సెకండ్లలోనే రూబిక్స్ క్యూబ్‌కు పరిష్కారం

Tue,March 13, 2018 02:24 AM

Blink and miss Robot solves Rubiks cube in 0.38 seconds

Rubiks-cube
బోస్టన్: రూబిక్స్ క్యూబ్ తెలుసుగా.. ఒకే రంగు గడులు ఒకేవైపునకు వచ్చేలా తిప్పాలి. దీన్ని కొందరు సెకండ్లలో పరిష్కరిస్తే మరికొందరికి రోజులు ప్రయత్నించినా సాధ్యం కాదు. కానీ ఓ రోబో మాత్రం కంటిరెప్ప కొట్టే లోపే క్యూబ్‌ను పరిష్కరిస్తూ ఆశ్చర్యం కలిగిస్తున్నది. అమెరికాలోని మసాచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థి బెన్ కాట్జ్, సాఫ్ట్‌వేర్ డెవలపర్ జరెడ్ డి కార్లో కలిసి ఈ రోబోను రూపొందించారు. ఇది కేవలం 0.38 సెకండ్లలోనే క్యూబ్‌ను పరిష్కరించింది. ఈ వీడియోను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది గిన్నిస్ రికార్డుగా నమోదయ్యే అవకాశం ఉన్నదని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జర్మనీకి చెందిన ఆల్బర్ట్ బీర్ రూపొందించిన సబ్1 రీలోడెడ్ అనే రోబో పేరుమీద గిన్నిస్ రికార్డు నమోదై ఉన్నది. ఈ రోబో 0.63 సెకండ్లలో క్యూబ్‌ను పరిష్కరించింది.

446

More News

VIRAL NEWS