చనిపోయిన మహిళ గర్భాశయం ద్వారా శిశువు జననం!

Thu,December 6, 2018 02:59 AM

Baby girl becomes first born after womb transplant from deceased

-బతికున్న మహిళకు గర్భాశయాన్ని అమర్చిన వైద్యులు
-ఈ తరహా జననం ప్రపంచంలో ఇదే తొలిసారి

వాషింగ్టన్: చనిపోయిన మహిళా దాత నుంచి స్వీకరించిన గర్భాశ యం ద్వారా ఓ బ్రెజిలియన్ మ హిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. చనిపోయిన మహిళ నుం చి సేకరించిన గర్భాశయం ద్వారా ఓ బిడ్డకు విజయవంతంగా జన్మనివ్వడం ప్రపంచంలో ఇదే తొలిసారి. అత్యంత అరుదైన ఈ కేసు వివరాలు లాన్సెంట్ జర్నల్ పత్రికలో ప్రచురితమయ్యాయి. చనిపోయిన మహిళా దాతల గర్భాశయాల మార్పిడి సాధ్యమేనని ఈ కేస్‌స్టడీ నిరూపిస్తున్నదని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఈ పద్ధతి ద్వారా గర్భాశయ వంధత్వం కలిగిన మహిళలు గర్భందాల్చడం సులభమని.. ఈ విధానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే బతికి ఉన్న మహిళ నుంచి గర్భాశయాలను స్వీకరించాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు.

1002
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles