చనిపోయినా చలనం!

Sat,September 14, 2019 02:39 AM

Australian scientist finds that corpses move for more than a year after death

- ఏడాదికిపైగా.. శరీరం కుళ్లిపోతున్నకొద్దీ
- చేతుల్లో కదలికలు కనుగొన్న ఆస్ట్రేలియా శాస్త్రవేత్త


సిడ్నీ: చనిపోయిన తర్వాత కూడా మనుషుల శరీరంలో కదలికలు ఉంటాయట. అదీ ఏడాదికి పైగా. ముఖ్యంగా చేతుల్లో ఈ మార్పులు కనిపిస్తాయట. శరీరం కుళ్లిపోతున్నకొద్దీ వాటి స్థానంలో మార్పు కనిపిస్తుందట. ఆస్ట్రేలియాకు చెందిన అలిసన్ విల్సన్ అనే శాస్త్రవేత్త దాదాపు 17 నెలలపాటు పరిశోధించి ఈ సంచలన విషయాన్ని కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేర పరిశోధకులు (డిటెక్టివ్స్), పాథాలజిస్టులకు ఈ పరిశోధన ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అలిసన్ ఆస్ట్రేలియాలోని సీక్యూ యూనివర్సిటీ నుంచి క్రిమినాలజీలో డిగ్రీ చేశారు. మనిషి చనిపోయిన తర్వాత మృతదేహం ఏ విధంగా కుళ్లుతుంది? ఈ క్రమంలో జరిగే మార్పులు ఎలా ఉంటాయి? అనే అంశాలపై అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నారు. తన పరిశోధన కోసం సిడ్నీ నగర శివారులోని ఆస్ట్రేలియన్ ఫెసిలిటీ ఫర్ టాఫోనోమిక్ ఎక్స్‌పరిమెంటల్ రీసెర్చ్ (ఆఫ్టర్) అనే సంస్థను ఎంచుకున్నారు. దీన్నే బాడీ ఫాం అని పిలుస్తుంటారు.
Alyson-Wilson
ఇక్కడ మృతదేహాలపై పరిశోధనలు జరుపుతుంటారు. మనుషులతోపాటు వివిధ రకాల జంతువుల శవాలను బహిరంగ ప్రదేశాల్లో పడేసి సహజంగా కుళ్లేలా చేస్తారు. ఈ క్రమంలో జరుగుతున్న మార్పులను పరిశీలిస్తారు. బాడీ ఫాంలో మొత్తం 70 మృతదేహాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. అలిసన్ విల్స్ తన పరిశోధనలో భాగంగా మానవ మృతదేహాలను ఎంచుకున్నారు. వాటిని పడేసిన ప్రాంతంలో ప్రత్యేకమైన కెమెరాలను అమర్చారు. ఇవి 30 నిమిషాలకు ఒకసారి ఫొటోలు తీస్తుంటాయి. ఇలా ఆమె దాదాపు 17 నెలలు పరిశోధన కొనసాగించారు. ఆ ఫొటోలను అన్నింటినీ విశ్లేషించగా చేతుల్లో కదలికలు కనిపించాయి. మరణించిన తొలిరోజుల్లో చేతులు శరీరానికి దగ్గరగా ఉండేవి. శరీరం కుళ్లుతున్న కొద్దీ అవి క్రమంగా దూరం జరిగి, చివరికి తిరిగి శరీరం వద్దకే వచ్చాయని తేలింది.

1190
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles