ఆస్ట్రేలియాలో మీడియా ఉద్యమ బాట

Tue,October 22, 2019 03:36 AM

-ప్రభుత్వ ఆంక్షలపై నిరసన
-మొదటి పేజీ వార్తా కథనాలపై నల్ల రంగు

సిడ్నీ: ఆస్ట్రేలియాలో మీడియా సంస్థలు ఉద్యమ బాటపట్టాయి. మీడియా స్వేచ్ఛపై ప్రభుత్వ ఆంక్షలకు వ్యతిరేకంగా దేశంలోని ప్రముఖ దినపత్రికలన్నీ సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపాయి. మొదటి పేజీపై ఎర్రని రంగుతో సీక్రెట్ అని ముద్రించి, ఆ పేజీలోని వార్తా కథనాలు కనిపించకుండా వాటిమీద నల్ల రంగుతో నిరసన వ్యక్తంచేశాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో ఆస్ట్రేలియా ప్రత్యేక బలగాల యుద్ధ నేరాలను బయటపెడుతూ ఇద్దరు ఏబీసీ విలేకరులు వార్తాకథనాలు రాశారు. దేశ పౌరులపై నిఘా పెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నదంటూ స్మిథర్స్ జర్నలిస్టు ఒక వార్తా కథనం ప్రచురించారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిపై క్రిమినల్ అభియోగాలు మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఏబీసీ ప్రధాన కార్యాలయం, న్యూస్ కార్ప్ జర్నలిస్టు అన్నికా స్మెథర్స్ ఇంటిపై ఆస్ట్రేలియా పోలీసులు దాడి చేశారు. దీంతో మీడియా సంస్థలు ఆందోళన బాటపట్టాయి. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కానీ జర్నలిస్టులు చట్టాలకతీతం కాదన్నారు.

291
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles